• Skip to main content
  • Skip to primary sidebar

All Jobs Adda Telugu

About Us

We provide Government, Private, IT/Software job updates in Telugu. We also provide articles on Finance, Work From Home, Loans, Business, and others!

  • LATEST
    • LATEST GOVT JOBS
    • RAILWAY JOBS
    • BANK JOBS
  • AP GOVT JOBS
    • AP LOCAL JOBS
  • TS GOVT JOBS
    • TS LOCAL JOBS
  • PRIVATE JOBS
    • HYD JOBS
  • FEATURED
    • TECHNOLOGY
    • BUSINESS
    • ENTERTAINMENT
    • GADGETS

Judiciary Jobs

AP High Court Jobs Notification 2025: 1,620 ఖాళీలు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి, అర్హత, పరీక్ష చివరి తేదీ, జీతం వివరాలు

26/05/2025 by Admin Leave a Comment

AP High Court Recruitment 2025:

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లా కోర్టులలో 1,620 ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు మే 13, 2025 నుండి జూన్ 2, 2025 వరకు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తులను సమర్పించగలరు.

అర్హత, ముఖ్యమైన తేదీలు, జీతం పరిధి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం, అర్హత ప్రమాణాలు, PDF ఫార్మాట్‌లో నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడం మరియు ఇతర వాటి గురించి తెలుసుకోవడానికి కథనాన్ని చివరి వరకు చదవండి.

AP High Court Jobs Notification 2025: Subordinate, ASO, Examiner, Assistant, Junior Assistant, Typist and Stenographer Jobs

  • మొత్తం ఖాళీలు: 1,620
  • ఆఫీస్ సబార్డినేట్ – 651 పోస్టులు
  • జూనియర్ అసిస్టెంట్ – 230 పోస్టులు
  • కాపీయిస్ట్ – 193 పోస్టులు
  • ప్రాసెస్ సర్వర్ – 164 పోస్టులు
  • టైపిస్ట్ – 162 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ – 80 పోస్టులు
  • ఫీల్డ్ అసిస్టెంట్ – 56 పోస్టులు
  • ఎగ్జామినర్ – 32 పోస్టులు
  • డ్రైవర్ – 28 పోస్టులు
  • రికార్డ్ అసిస్టెంట్ – 24 పోస్టులు

Also Read:

  • Indian Air Force Group C jobs, notification, apply online, salary, official website, last date, PDF download, examination mode, recruitment details.
  • AP Outsourcing Jobs 2025 Notification, Apply Online, Salary, PDF in Telugu

AP High Court Jobs Recruitment: Application Fee, Age Limit, Educational Qualification, Eligibility Criteria

దరఖాస్తు రుసుము:

  • జనరల్ కేటగిరీకి ₹500
  • SC/ST/BC అభ్యర్థులకు ₹200

విద్యా అర్హత: 7వ తరగతి నుండి డిగ్రీ (జాబ్ పోస్ట్ కేటగిరీ ఆధారంగా)

వయస్సు పరిమితి: 18 నుండి 42 సంవత్సరాలు (SC/ST/BC అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు).

దరఖాస్తు విధానం/దరఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: మే 13, 2025
  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: జూన్ 2, 2025
  • పరీక్ష తేదీ: ప్రకటించబడుతుంది
  • అధికారిక వెబ్‌సైట్: https://aphc.gov.in

Filed Under: AP GOVT JOBS, Judiciary Jobs, LATEST

Supreme Court Recruitment Jobs 2024: సుప్రీం కోర్ట్ లో 107 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. రూ. 67,000 వరకు జీతం. పూర్తి వివరాలు…

08/12/2024 by Admin Leave a Comment

Supreme Court Recruitment Jobs 2024: భారత అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీమ్ కోర్ట్ లో 107 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయినది. కావున ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి, ఆసక్తి గలవారు మరియు అర్హులు అయిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకొని ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

SUPREME COURT RECRUITMENT NOTIFICATION 2024: TOTAL JOBS/VACANCIES, SALARIES, EXAM DATE, LAST DATE, APPLY ONLINE, OFFICIAL WEBSITE, PDF DOWNLOAD

Supreme Court Recruitment Jobs Notification 2024: న్యూఢిల్లీ లోని భారత అత్యున్నత న్యాస్థానం సుప్రీం కోర్టులో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం ఆహ్వానించడం జరిగినది. మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 107 కోర్ట్ మాస్టర్ (షార్ట్ హ్యాండ్) (గ్రూప్-ఏ గెజిటెడ్), సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్-బీ), పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్-బీ) ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ధరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 25 ని ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది, కావున ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. టైపింగ్ టెస్ట్, వ్రాత పరీక్ష, కంప్యూటర్ నాలెడ్జి టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు మరియు మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం, అప్లై చేసుకోవడానికి/దరఖాస్తు సమర్పించుకోవడానికి అధికారిక వెబ్సైటు సందర్శించి చూడొచ్చు.

  • మొత్తం ఖాళీల సంఖ్య : 107
  • కోర్టు మాస్టర్‌ (షార్ట్‌హ్యండ్‌ మరియు గ్రూప్‌-ఏ గేజిటెడ్‌) పోస్టుల సంఖ్య: 31
  • సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-బీ) పోస్టుల సంఖ్య: 33
  • పర్సనల్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-బీ) పోస్టుల సంఖ్య: 43

ఇతరత్రా ముఖ్య సమాచారం:

ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల అర్హతల విషయానికొస్తే… కోర్టు మాస్టర్ పోస్టులకైతే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే డిగ్రీతోపాటు 120 WPMతో ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ స్పీడ్, 40 WPMతో కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ లో అర్హత తప్పనిసరిగా ఉండాలి. ఇక పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల విషయానికి వస్తే దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు ఏదైనా డిగ్రీ కోర్స్ లో ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్ లో 100 WPM షార్ట్ హ్యాండ్ స్పీడ్, 40 WPM కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అర్హత సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.

Also Read:

  • AP High Court jobs notification, apply online, salary, vacancies, last date, syllabus

అభ్యర్థుల వయోపరిమితి:

  • కోర్ట్ మాస్టర్ పోస్టులకు అభ్యర్థులు 30 నుంచి 45 ఏళ్ళు.
  • సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ళు.
  • పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ళు.

పైన పేర్కొన్న విధంగా అర్హతలు కలిగిన వారు ఎవరైనా డిసెంబర్ 25, 2024వ తేదీలోగ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తుల రుసుము ఈ విధంగా ఉన్నాయి… జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్-సర్వీస్మెన్/పీహెచ్ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

అధికారిక నోటిఫికేషన్‌

  • SCI Recruitment Official Website

ఎంపిక విధానం మరియు వేతనం వివరాలు:

ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులను టైపింగ్ టెస్ట్, వ్రాత పరీక్ష, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు పొందినవారు కోర్ట్ మాస్టర్ పోస్టుకు రూ.67,000, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ కు రూ.47,600, పర్సనల్ అసిస్టెంట్ కు రూ.44,900 చొప్పున నెలవారి జీతం చెల్లిస్తారు. డిసెంబర్ 25, 2024 దరఖాస్తులకు చివరి తేదీ. దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయినా తరువాత దేశవ్యాప్తంగా గల 23 ప్రధాన నగరాల్లో వ్రాత పరీక్షా నిర్వహిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు.

Filed Under: Judiciary Jobs

Primary Sidebar

  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • Contact Us
  • Disclaimer

Copyright AllJobsAddaTelugu© 2025