Supreme Court Recruitment Jobs 2024: సుప్రీం కోర్ట్ లో 107 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. రూ. 67,000 వరకు జీతం. పూర్తి వివరాలు…

By Admin

Updated On:

Follow Us
SUPREME COURT RECRUITMENT NOTIFICATION 2024: TOTAL JOBS/VACANCIES, SALARIES, EXAM DATE, LAST DATE, APPLY ONLINE, OFFICIAL WEBSITE, PDF DOWNLOAD
Join our Telegram Group for Latest Job updates & official notifications in PDF Format. Join Now
Rate this post

Supreme Court Recruitment Jobs 2024: భారత అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీమ్ కోర్ట్ లో 107 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయినది. కావున ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి, ఆసక్తి గలవారు మరియు అర్హులు అయిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకొని ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

SUPREME COURT RECRUITMENT NOTIFICATION 2024: TOTAL JOBS/VACANCIES, SALARIES, EXAM DATE, LAST DATE, APPLY ONLINE, OFFICIAL WEBSITE, PDF DOWNLOAD

Supreme Court Recruitment Jobs Notification 2024: న్యూఢిల్లీ లోని భారత అత్యున్నత న్యాస్థానం సుప్రీం కోర్టులో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం ఆహ్వానించడం జరిగినది. మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 107 కోర్ట్ మాస్టర్ (షార్ట్ హ్యాండ్) (గ్రూప్-ఏ గెజిటెడ్), సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్-బీ), పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్-బీ) ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ధరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 25 ని ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది, కావున ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. టైపింగ్ టెస్ట్, వ్రాత పరీక్ష, కంప్యూటర్ నాలెడ్జి టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు మరియు మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం, అప్లై చేసుకోవడానికి/దరఖాస్తు సమర్పించుకోవడానికి అధికారిక వెబ్సైటు సందర్శించి చూడొచ్చు.

  • మొత్తం ఖాళీల సంఖ్య : 107
  • కోర్టు మాస్టర్‌ (షార్ట్‌హ్యండ్‌ మరియు గ్రూప్‌-ఏ గేజిటెడ్‌) పోస్టుల సంఖ్య: 31
  • సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-బీ) పోస్టుల సంఖ్య: 33
  • పర్సనల్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-బీ) పోస్టుల సంఖ్య: 43

ఇతరత్రా ముఖ్య సమాచారం:

ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల అర్హతల విషయానికొస్తే… కోర్టు మాస్టర్ పోస్టులకైతే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే డిగ్రీతోపాటు 120 WPMతో ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ స్పీడ్, 40 WPMతో కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ లో అర్హత తప్పనిసరిగా ఉండాలి. ఇక పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల విషయానికి వస్తే దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు ఏదైనా డిగ్రీ కోర్స్ లో ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్ లో 100 WPM షార్ట్ హ్యాండ్ స్పీడ్, 40 WPM కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అర్హత సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.

Also Read:

అభ్యర్థుల వయోపరిమితి:

  • కోర్ట్ మాస్టర్ పోస్టులకు అభ్యర్థులు 30 నుంచి 45 ఏళ్ళు.
  • సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ళు.
  • పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ళు.

పైన పేర్కొన్న విధంగా అర్హతలు కలిగిన వారు ఎవరైనా డిసెంబర్ 25, 2024వ తేదీలోగ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తుల రుసుము ఈ విధంగా ఉన్నాయి… జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్-సర్వీస్మెన్/పీహెచ్ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

అధికారిక నోటిఫికేషన్‌

ఎంపిక విధానం మరియు వేతనం వివరాలు:

ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులను టైపింగ్ టెస్ట్, వ్రాత పరీక్ష, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు పొందినవారు కోర్ట్ మాస్టర్ పోస్టుకు రూ.67,000, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ కు రూ.47,600, పర్సనల్ అసిస్టెంట్ కు రూ.44,900 చొప్పున నెలవారి జీతం చెల్లిస్తారు. డిసెంబర్ 25, 2024 దరఖాస్తులకు చివరి తేదీ. దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయినా తరువాత దేశవ్యాప్తంగా గల 23 ప్రధాన నగరాల్లో వ్రాత పరీక్షా నిర్వహిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు.

Leave a Comment